అరగొండ,
03-11-2013
అరగొండ గ్రామ సర్పంచ్ గారికి.
సర్పంచ్ గారికి,
విషయము: అరగొండ గ్రామాభివృద్ది కొరకు / ఆదర్శ గ్రామంగా చేయుటకు తగు
చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో మీ విజయానికి మా అభినంధనలు.
అరగొండ గ్రామ సర్పంచ్ గా మీరు మీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని మరియు మీ
పదవీ కాలములో మన గ్రామం ఆదర్శ గ్రామముగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము. మీ
విధి నిర్వహణలో మావంతు సహాయ సహకారాలను అందిస్తామని ఈ సంధర్బంగా తెలియచేస్తున్నాము.
ఈ లేఖ మూలముగా క్రింది విషయాలను, మన
గ్రామ పౌరుల శ్రేయస్సుకోసం, మన గ్రామ అభివృధ్ధిలొ వాటి ఆవశ్యకతను మీ దృష్టికి
తీసుకొని వస్తున్నాము.
1. గ్రంధాలయము
ఏర్పాటు చేయటం:
పిల్లలు, యువకులు ఎదగడానికి,
సక్రమమైన దారిలో నడవడానికి గ్రంధాలయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక పుస్తకం
చదవటం వంద మంది మేధావులతో సహవాసం చేయటంతో సమానం అంటారు. గ్రంధాలయం యువతను పెడదోవ
పడకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది. మన గ్రామము నుంచి వచ్చే ఐదు సంవత్సరములలో కనీసం ఒక
IAS లేదా
ఒక IPS ను
పంపుటకు ఉపయోగపడగలదు. అంతే గాక నిరుద్యోగులు ఉద్యోగ,
ఉపాధి అవకాశాల గురించి సమాచారం తెలుసుకొనుటకు, రైతులు
వ్యవసాయ సమాచారం, వివిధ పంటలు, వాటి
మార్కెట్ వివరాలు మరియు అధునాతన సాగుపద్ధతులు తెలుసుకొనుటకు ఉపయుక్తం కాగలదు. ఇంకా
వృత్తిపనులువారు వారి నైపుణ్యం పెంచుకొని వారి ఆదాయం పెంచుకునే అవకాశం లభిస్తుంది.
2. చెత్తయాజమాన్యం
(Solid waste
management) :
ప్రస్తుతం
మన గ్రామంలో అన్ని రకాల చెత్తను కలిపి వంకలో వేసి కాల్చడం జరుగుతున్నది. ఈ కారణం
గా వాతావరణంలోకి విషవాయువులు మనం విడుదల చేస్తున్నాము. భూమికాలుష్యం, గాలి కాలుష్యం
జరుగుతున్నది.
కొన్ని
శాస్త్రీయపద్ధతులు పాటించటం వల్ల ఈ విపరిణామాలను మనం నియంత్రించవచ్చును. చెత్త
లోని ప్లాస్టిక్ పదార్థాలను వేరు చేసి మిగిలిన వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా
మార్చవచ్చును. వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ కంపనీలకు
అమ్మవచ్చును. కంపోస్ట్ ఎరువును కూడా
రైతులకు అమ్మవచ్చను. ఈ విధంగా వాతావరణ కాలుష్యాన్ని
తగ్గించడంతో పాటు పంచాయతీ ఆదాయము పెరుగుతుంది. చెత్తను ఇంటివద్దే వేరు చేసి
చెత్తకుండీలలో వేసే విదంగా ప్రజలను ప్రోశ్చహించాలి. ప్రజల సహకారంతో చెత్తకుండీలకు
అనువైన స్థలాన్ని గుర్తించి, అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలకు, ఇతర వ్యర్థాలకు
విడివిడిగా చెత్తకుండీలను ఏర్పాటు చేయాలి. చెత్త కుండీల నిర్వహణ బాద్యతలను వార్డ్
మెంబర్ కు/స్థానికంగా వున్న వారికి అప్పగిస్తే దీర్గకాలంలో వాటి నిర్వహణలో
ఎదురయ్యే సమస్యలు తగ్గవచ్చు.
వీటితో
పాటు ఆసుపత్రుల నుండి వచ్చు వ్యర్థాలను (గాజు సీసాలు, సిరంజులు, మొదలగునవి) తగు జాగ్రత్తలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పారవేయడానికి
మన ప్రాంత ఆసుపత్రులు తగు చర్యలు తీసుకునేలా చూడాలి.
3. స్మశానవాటికకు
స్థల/సరిహద్దులు గుర్తింపు:
తవణంపల్లి మండలంలో
చాలా గ్రామాల్లో శ్మశానవాటికకు
అధికారికంగా స్థలాన్ని కేటాయించుకొని
స్మశానవాటికను నిర్మించుకొన్నారు. మన
ఊరు
మేజర్ పంచాయితీ అయినప్పటికీ ఇంతవరకు స్మశానానికంటూ స్థలాన్ని అధికారికంగా
కేటాయించలేదు. మండలంలోని ఏ గ్రామానికి
లేని విధంగా మన గ్రామంలో అపోలో ఆసుపత్రి, నర్సింగ్
కాలేజీ, ఇషా ఫౌండేషన్ స్కూల్,
రెండు జాతీయ బ్యాంకులు, శివాలయం, రామాలయం,
అర్ధగిరి వీరాంజనేయ స్వామి వంటి పురాతన దేవాలయాలతో విరాజిల్లుతున్నా, అధికారికంగా
శ్మశానవాటిక లేని లోటు మన గ్రామాభివృద్ధిపాత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది.
4. సమగ్రమైన
త్ర్రాగునీటి సరఫరా :
మన గ్రామoలో మినరల్ వాటర్ అందుబాటులో ఉన్నపటికీ ప్రతిఒక్కరూ దానిని
వినియోగించడo లేదు. 20 కేజీల
బరువున్న నీళ్ళ క్యాన్ వెళ్ళి తెచ్చుకోవడమే ప్రధాన కారణoగా
తెలుస్తుంది. అందుకు తగిన
సరఫరా ఏర్పాట్లు చేసి గ్రామ ప్రజలకు పరిశుద్దమైన నీటిని మరింత అందుబాటులోకి
తేవాలి. ఇందుకు నామమాత్రపు రుసుము వసూలు చేయవచ్చును.
5. పంచాయతీలో
అవినీతి లేని పరిపాలన:
పంచాయతీ ద్వారా ఏ కార్యక్రమము చేసినా పారదర్శకంగా చేయడం,
పంచాయతీ బడ్జెట్ ను జనసంవర్దమున్న ప్రాంతాలలో(బస్ స్టాండ్ లో ) ప్రదర్శించటం
ద్వారా, ప్రతి అభివృద్ది కార్యక్రమములో ప్రజలను భాగస్వామ్యం
చేయటం ద్వారా మరియు గ్రామ సభలలో అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకోవటం
ద్వారా పరిపాలనలో పారదర్శకతను పెంచి ప్రజాస్వామ్యం పట్ల ప్రజల నమ్మకాన్ని పెంచే ప్రయత్నాలు చేయటం
ద్వారా మన గ్రామాన్ని ఆధర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో విజయం సాదించటానికి ప్రయత్నం
చేయాలి.
అవినీతి అన్ని అనర్థాలకు మూలం. కేంద్ర ప్రభుత్వంలో
అవినీతి దేశాన్ని, దేశాభివృద్ధిని ఎంతగా దెబ్బతీస్తుందో పంచాయతీ లోని
అవినీతి గ్రామాన్ని, గ్రామాభివృద్ధిని అంత దెబ్బతీస్తుంది. అవినీతి ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించ కూడదు. ఉదా: గ్రామపరిధిలోని పన్నుల వసూలుకు సంబంధించి
పంచాయితీ ఆధయానికి గండి కొట్టే చర్యలు- నిబందనలకు మించి గేటు వసూలు చేయడం తద్వారా
వ్యక్తిగత ప్రయోజనం, దీపాళికి అంగళ్ళకు లైసన్సులు జారీచేయటంలో చేతివాటం
ప్రదర్శించటం, మొదలగునవి...
6. గ్రామ
ప్రజలకు లంచం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలలో పనులు జరిగే ఏర్పాటు చేయడం:
ఏ ప్రభుత్వ (రెవెన్యూ,
రిజిస్ట్రేషన్, మొదలైన) కార్యాలయంలోనైనా పని చేసుకోవాలంటే గ్రామస్తులు
(లంచం లాంటి) ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. వారికి మీ మాట సాయం ఉంటే ఎటువంటి
ఇబ్బంది లేకుండా పనులు చేసుకొనే వెసులుబాటు వుంటుంది.
7. వివిధ
పతకాల వివరాల ప్రచురణ - అందరికీ తెలియటానికి ఏర్పాట్లు:
ఈ క్రింది
కార్యక్రమాల వివరాలు మన పంచాయతీ లోని ప్రజలకు తెలియటానికి తగు ఏర్పాట్లు చేయాలి..
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పతాకం (Mahatma
Gandhi National Rural Employment Guarantee Programme), మధ్యాహ్న
భోజన పతకం (Mid-day Meal),
ఇందిరా ఆవాస యోజన (Indira Awaas Yojana),
సర్వ శిక్ష్య అభ్యన్ / రాజీవ్ విద్యా మిషన్(Sarva
Shiksha Abhiyan/Rajiv Vidhya Mission),
ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (Pradhan Mantri Gram Sadak
Yojana), జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (National
Rural Health Mission), రాష్ట్రీయ బాలల ఆరోగ్య కార్యక్రమం (Child
Health), జననీ సురక్ష యోజన మరియు సుఖీభవ(Janani
Suraksha Yojana and Sukhibhava), ఆడపిల్లల రక్షణ పతకం (Girl Child
Protection Scheme), నిర్మల్ భారత్ అభియాన్ (Nirmal
Bharat Abhiyan), ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పతకం (Indira
Gandhi National Old Age Pension Sheme).
ఇవే కాకుండా పంచాయతీ ద్వారా ఏ కార్యక్రమాలు/పతకాలు అమలు
చేస్తున్నా/చేసినా ప్రజలకు తెలియచేయటానికి తగు ఏర్పాట్లు చేయాలి.
8. గ్రామాభివృద్ధి
కమిటీలు :
సమగ్ర గ్రామాభివృద్దికి తగిన సూచనలు ఇవ్వడానికి వివిధ రంగాలకు చెందిన మేధావులతో
గ్రామాభివృద్ధి సలహా కమిటీ మరియు గ్రామములోని వివిధ సమస్యలు గుర్తించి పరిష్కరించటానికి
గ్రామ ప్రజలతో కొన్ని కమిటీలు నియమించాలి. అందులో గ్రామానికి సంబంధించిన అన్నీ వర్గాలవారికి
ప్రాతినిధ్యం ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
9. మరుగుదొడ్ల
ఏర్పాటు:
గ్రామములో
ప్రజా మరుగుదొడ్లు (Public
Toilets) కొరత తీవ్రంగా కనిపిస్తున్నది. ఈ కారణంగా గ్రామములొ పారిశుధ్యం
లోపిస్తున్నది (ఉదా: పాత బస్టాండు కు దగ్గరగా వున్న రెడ్డివారి వీధిలో,
చిత్తూరు వైపున వున్న రోడ్డు లో, హైస్కూల్ కు దగ్గర రోడ్డులో బహిరంగంగా మల/మూత్ర విసర్జన
వల్ల అపరిశుబ్రత చూడవచ్చు) . గ్రామములో
వివిధ ప్రాంతాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలి. కొత్త బస్ స్టాండ్ ఎప్పుడూ ప్రయాణికులు,
విధ్యార్థులు, చుట్టుప్రక్కల గ్రామాలలోని ప్రజల రాకపోకలతో రద్దీగా ఉoటుoది. కానీ మరుగు దొడ్ల నిర్వహణ చాలా అద్వాన్నంగా ఉoటుoది.
10. మురుగు
కాలువ నిర్వహణ:
గ్రామములో మురుగు కాలువ సౌలబ్యము లేని రహదారులకు మురుగు
కాలువల నిర్మాణము చేయ ప్రార్ధన .
స్టానిక ప్రజలు/వార్డ్ మెంబర్ తో మురుగు కాలువల నిర్వాహణ
కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా మురుగుకాలువల నిర్వహణలో
తలెత్తు సమస్యలను కొంచం అయినా అధిగమించవచ్చు.
11. ప్రభుత్వ
పాఠశాలల అభివృధ్ధి:
చదువు
గురుంచి మీకు తెలియంది కాదు. మన భవిష్యత్తు
తరాలవారు మన ఊరికి రావాలన్నా, పక్కవూరి వారు లేదా రాష్ట్రంలోని/దేశంలోని మిగతా
ప్రాంతాలవారు మనగురించి గొప్పగా చెప్పుకోవాలన్నా లేదా మన తరువాతి తరం,
మన పిల్లల భవిష్యతు బాగుగా వుండాలన్నా మన గ్రామములోని పాఠశాలలు పిల్లలను
క్రమశిక్షణతో ఉత్తమమైన విద్యను అందించే దేవాలయాలుగా మారేలా చర్యలు తీసుకోవాలి.
పై విషయాలలో కొన్ని మీ పరిధి లోనివి కాకపోయినప్పటికీ మన
గ్రామ అభివృద్ధిలో ప్రతి విషయం అవసరమని మీ ముందుకి తెస్తున్నాము. వాటి సాధనకు మీరు
కృషి చేస్తారని విశ్వసిస్తున్నాము. మన పంచాయతీ లోని గ్రామాల అభివృద్ధికి మీకు ఎల్లవేళలా తోడ్పాటు అందించటానికి మేము
ఇట్లు
గ్రామ అభివృద్ధి కాంక్షిస్తూ
హేమంత్( జిల్లా సహాయ కార్యదర్శి, లోక్
సత్తా పార్టీ, చిత్తూరు జిల్లా),
గణేష్ రెడ్డి (లోక్ సత్తా), నూతన్
బాబు (లోక్ సత్తా), జ్యోతీశ్వర్ (లోక్ సత్తా), వేణుగోపాల్
A.L (లోక్ సత్తా),
సునీల్ కుమార్ D(లోక్
సత్తా), మూందీప్ రెడ్డి,
శరత్ బాబు, విమల్, సందీప్,
కిశోర్ రెడ్డి, వినోద్
రెడ్డి, మహేశ్, సుబ్రమణ్యం/సుబ్రి,
సునీల్,
మస్తాన్, నవీన్,
పవన్ కుమార్ , నాగరాజ్, నవీన్ కుమార్,
హరి ప్రసాద్,
వంశి, చాను, గణేష్, మహేశ్, అరుణ్
మరియు అరగొండ యూత్...
Photo: Loksatta members with Aragonda Panchayat Sarpanch (dt:03 Nov 2013 6:00PM)
News in Local news paper - Courtesy: Sakshi dt-05-Nov-2013
1 comment:
Finally Sakshi helped to print the news... :)
It is really good idea. All the best for trails...
Post a Comment