Aragonda,
31-12-2021
To
Sarpanch,
Aragonda Panchayati,
Aragonda
అరగొండ గ్రామ సర్పంచ్ గారికి.
అయ్యా/అమ్మా,
Sub: మన ప్రాంత
అభివృద్ధికై, ఆర్థిక, సామజిక
భద్రతకు - అరగొండ గ్రామ పంచాయతీ - ముఖ్య పాత్ర పోషించ వలసిన అవసరం - క్రియాశీల చర్యలకు
- సంబంధించి
అరగొండ
గ్రామనివాసిగా, మరియు
బాధ్యత గలిగిన నియోజకవర్గ లోక్ సత్తా పార్టీ నాయకులు గా ఈ క్రింది సమస్యలు మీ
దృష్టికి తెస్తూ , వాటికీ
సాధ్యమైన పరిష్కారాలు సూచిస్తూ, వాటిని అమలు చేయాలని కోరుతూ..
మనకు
ఉన్న సమస్యల్లో ప్రధానమైనవి ఈ ఐదు:
1.
పారిశుద్ధ్య లోపం - బహిరంగ మూత్రవిసర్జన
2.
యువత, భావితరం
- విద్య, నిరుద్యోగం;
3.
వ్యవసాయం - సహాయక వ్యవస్థ (support system) లేక
పోవటం
4. బెంగళూరు జాతీయ రహదారికి (NH4/NH69) మరియు
తిరుపతి జాతీయ రహదారి (NH
140) కి అరగొండ కి ఇరుకైన రోడ్డు - అభివృద్ధికి సవాళ్లు
5. బాలికల స్కూల్ డ్రాప్ ఔట్ లు
ఈ
సమస్యలు పై మన గ్రామం పరిష్కరించడంలో
ముందుంటారని ఆశిస్తు ఈ క్రింది సాధ్యమైన పరిష్కారాలు సూచిస్తున్నాము.
1.
ప్రజల సూచనలను స్వీకరించి,
పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్‌లను గుర్తించి పబ్లిక్ టాయిలెట్లను
నిర్మించి పారిశుద్ధ్యం లో మన పంచాయతీ ఆదర్శంగా నిలవాలి - అన్ని దశలలో ప్రజలను భాగస్వామ్యం చేయండం
ద్వారా ఈ ప్రయత్నాన్ని దీర్ఘకాలం కొనసాగించవచ్చు
2. "సరైన విద్య మాత్రమే ప్రజల
జీవితాల్లో నిజమైన మార్పును
తీసుకురాగలదు" అన్నారు డా. అంబెడ్కర్ గారు. సంక్షేమ పథకాలు (పెన్షన్లు, మొ!...)
తాత్కాలికంగా కొంత ఉపశమనం ఇచ్చినా, దీర్ఘ కాలంలో విద్య
మాత్రమే వారివారి హోదాను, ఆర్థిక బలాన్ని పెంచ గలదు.
కాస్త
స్తొమత, స్తొమత
లేకపోయినా అప్పు చేసే సామర్థ్యం ఉన్నవారు వారి పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. మిగిలిన వెనుకబడిన
వారు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్నారు. గ్రామ పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఇది
విద్యాశాఖ పరిధిలో ఉన్నపటికీ ) బాధ్యత కొంత తీసుకొని, ద్రుష్టి సారించి, అందుబాటులో
ఉన్న పథకాలతో పాఠశాల స్కూలు మేనేజ్మెంట్ కమిటీ తో కలిసి పాఠశాల అభివృద్ధి కై
ప్రణాళిక చేసి, ప్రతి 3 నెలలకు కనీసం ఒక్క సారైన
సమీక్ష జరుపుతూ, మన
గ్రామస్థులం చదువులోనూ అదర్శంగా నిలిచేలా
చేయాలి
గ్రామానికి
గ్రంధాలయం ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్ర గ్రంధాలయం మనకు అన్ని
విధాలా సాయచేసేందుకు సిద్ధంగా ఉందని గమనించండి. ఈ విషయమై మనం కట్టే ఆస్థిపన్ను
లో ఒక్క భాగంగా గ్రంధాలయ సెస్సు దశబ్ధాలుగా కటుతున్నప్పటికి మన గ్రామానికి
గ్రంధాలయం లేకపోవటం శోచనీయం. అందుపాటులో గ్రంధాలయం లేకపోవటం తో మన గ్రామ యువత
పెద్ద ఉధ్యోగలకి (ఐఏఎస్, ఐపిఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, మొ...) పోటీ పరీక్షల్లో నెగ్గలేకపోతున్నారు.
3.
మన ప్రాంతం లో వ్యవసాయానికి ఉన్న ప్రధాన సమస్య అధునాతన పనిముట్లు లేక పోవడం, సరైన ధరలు
రైతుకు అందక పోవడం మరియు మానవ వనరుల
సమస్యలు - వెరశి రోజు రోజు కి వ్యవసాయ భూమి తగ్గుతోంది. ఇది ఇలానే కొనసాగితే అది
మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
వ్యవసాయానికి
మానవ వనరుల సంక్షోభం ఉందని పంచాయతీ గుర్తించాలి. దీనికి ఒక ప్రధాన కారణం ఇది
అసంఘటిత రంగంగా ఉండడం. దీనికి పరిష్కారంగా
వ్యవసాయ కార్మిక సొసైటీ ని ప్రారంభించి, అందులో
ప్రతి వ్యవసాయ కూలి,
రైతు సభ్యులుగా చేసుకొని వ్యవసాయంలో
అత్యాధునిక సాంకేతికతపై వారికి శిక్షణ ఇవ్వడం, ప్రతి ఒక్కరికి స్థిరమైన ఆదాయం
వచ్చేలా చేయటంతో పాటు రిటైర్మెంట్ వయసు లో పెన్షన్ లాంటి సౌకర్యాలు, భీమా వంటి
వాటితో ప్రతి ఒక్కరికి నాణ్యమైన జీవితం గడిపే లాగా ఈ సొసైటీ ఉపయోగ పడగలదు.
వ్యవసాయశాఖ, ఉద్యానవన
శాఖ, మార్కటింగ్
శాఖల తో, రైతులు
మరియు వ్యాపారస్తులతో ఒక సమాఖ్య/సంఘం ను పంచాయతీ నేతృత్వంలో
ఏర్పాటు చేసి వివిధ సమస్యల పరిష్కారాల
దిశగా ప్రయత్నం చేయాలి. ఇందుకు మన పంచాయతీ
ఈ వేదిక ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి అందరికి ఆదర్శం గా నిలుస్తుంది
అని ఆశిస్తున్నాము.
4. మన గ్రామానికి దగ్గరలోనే ఇటు బెంగళూరు, అటు చెన్నై, ఇంకో పక్క
తిరుపతి చేరుకోను జాతీయ రహదారులు
ఉన్నపటికీ గ్రామానికి రెండు వైపులా ఉన్న
రహదారులు ఇరుకు గా ఉన్నందువల్ల మనకు ఈ జాతీయ రహదారుల వాల్ల అంతంత మాత్రం ప్రయోజనం
కలుగుతోంది. బంగారుపాళం వైపు కు, ఇటు
చిత్తూరు పైపు ఉన్న రహదారి ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేలా
చేస్తే మన ప్రాంతం లో ని పరిశ్రమలకు, వ్యవసాయ ఉత్పత్తుల కు మంచి రహదారి
సౌకర్యంతో ప్రపంచస్థాయిని చేరుకొనే అవకాశం వస్తుంది. ఇది మర్రిన్ని స్థానిక
ఉద్యోగాలను సృష్టిస్తుంది. అంతే కాకుండా అర్థగిరి పర్యాటక కేంద్రంగా మరింత
అభివృద్ధి చెందేందుకు అవకాశం వస్తుంది. ఇది మన ప్రాంతం, పంచాయతీ
ఆర్థికంగా బలపడేందుకు అవకాశం గా మారుతుంది. ఇందుకు గ్రామసభలో ఒక తీర్మానం
చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టరుకు, జిల్లా పంచాయతీకి, జిల్లా
పరిషత్ కు, రోడ్లు
& భవనాల
శాఖకు, CHUDA కి పంపించి మన ప్రాంత అవసరాన్ని
తెలియచేయాలి
5. బాలికల స్కూలు డ్రాప్ ఔట్ లు మన రాష్ట్రంలోను మన ప్రాంతం లోనూ అధికంగానే
ఉంది. ఒక సర్వే ప్రకారం 90% బాలికల డ్రాప్ ఔట్ లు కేవలం “వాళ్ళకు స్కూలు పోయేటప్పుడు
కుటుంబ సభ్యులు తోడుగా పోవాలి” అనే అభిప్రాయం. దీనికి ప్రదాన కారణం అభద్రతా భావం.
రెండు సంవత్సరాల క్రితం CPAC నిర్వహించన సర్వే లో మన
గ్రామలోనే 20 కి పైగా ఫిర్యాదులు లో హై స్కూల్ కి పోయే దారి లో కొంత అబద్రత భావం
వెల్లడైంది. గ్రామ పంచాయతీ ఇక్కడ దృష్టి సారించాలి.
ఇందుకు
గాను, స్కూలు కి పోయి దారిలో, ఊరి శివారు
ప్రాంతంలో CCTV లు, సోలార్ దీపాలు పెట్టించాలి. దీనికోసం గ్రామ పంచాయతీ “నిర్భయ ఫండ్” నుంచి నిధులు సమకూర్చి
CCTV, సోలార్ దీపాలు సమకూర్చు కోవాలి. CCTV వ్యవస్థను పోలీసు కమాండ్ సెంటర్ కు అనుసంధానం చేసుకొనేందుకు పోలీసు శాఖ
ఎప్పుడు సిద్ధంగా ఉందని గమనించగలరు.
వీటితో
పాటు సమగ్ర గ్రామాభివృద్దికి తగిన సూచనలు ఇవ్వడానికి వివిధ రంగాలకు చెందిన
మేధావులతో గ్రామాభివృద్ధి సలహా కమిటీ మరియు గ్రామములోని వివిధ సమస్యలు గుర్తించి
పరిష్కరించడానికి గ్రామ ప్రజలతో కొన్ని కమిటీలు నియమించాలి. అందులో గ్రామానికి సంబంధించిన అన్ని
వర్గాలవారికి ప్రాతినిధ్యం ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
పై
విషయాలలో కొన్ని మీ పరిధి లోనివి
కాకపోయినప్పటికీ మన గ్రామ అభివృద్ధిలో ప్రతి విషయం అవసరమని మీ ముందుకి
తెస్తున్నాము. వాటి సాధనకు మీరు కృషి చేస్తారని విశ్వసిస్తున్నాము. మన పంచాయతీ
లోని గ్రామాల అభివృద్ధికి మీకు ఎల్లవేళలా తోడ్పాటు అందించటానికి మేము సిద్దంగా
ఉంటాము. మన గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చుకోవటానికి ప్రతి ఒక్కరూ కృషి
చేద్దాం.
ఇట్లు గ్రామ అభివృద్ధి కాంక్షిస్తూ
హేమంత్ కన్వినర్, లోక్ సత్తా పార్టీ ,
పూతలపట్టు నియోజక
వర్గం; సెక్రటరీ, చిత్తూరు పీపుల్ యాక్షన్ కమిటీ (CPAC) |
గణేష్, కన్వీనర్ అరగొండ బాయ్స్ క్లబ్ అరగొండ గ్రామ ఇంచార్జ్ లోక్ సత్తా పార్టీ, అరగొండ
|
No comments:
Post a Comment